తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటా అని వెలికితీసి చూడగా..!

తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన పెద్ద శబ్దం.. ఏంటా అని వెలికితీసి చూడగా..!


హాంకాంగ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో తవ్వకం పనులు చేస్తుండగా దాదాపు 100 ఏళ్ల నాటి రెండవ ప్రపంచ యుద్ధ బాంబు బయటపడింది. ఆ బాంబు బరువు దాదాపు 450 కిలోగ్రాములు, పొడవు 1.5 మీటర్లు. భద్రతా దళాలు ఈ బాంబును అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రకటించి వెంటనే నిర్వీర్యం చేసే ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

బాంబు బయటపడిందని సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించారు. మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించారు, దాదాపు 6,000 మందిని ఖాళీ చేయించారు. సమీపంలోని పద్దెనిమిది భవనాలల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరూ మిగిలి ఉండకుండా చూసేందుకు పోలీసులు ఇంటింటికీ తనిఖీలు నిర్వహించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో హాంకాంగ్-జపాన్ దేశాలు భీకర పోరాటాన్ని చవిచూశాయి. ఆ కాలం నాటి అనేక బాంబులు ఇప్పటికీ భూమిలో పాతిపెట్టబడి ఉన్నాయి. 2018లో, వాన్ చాయ్ జిల్లాలో ఇలాంటి బాంబు కనుగొనడం జరిగింది. దీని వలన 1,200 మంది ప్రజలు ఖాళీ చేయించారు. దానిని నిర్వీర్యం చేయడానికి 20 గంటల సమయం పట్టింది.

పేలని బాంబులు (UXBలు) హాంకాంగ్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో బయటపడుతున్నాయి. జూన్ 2025లో, జర్మనీలో మూడు అమెరికన్ బాంబులు కనుగొనడం జరిగింది. దీని వలన 20,000 మంది ప్రజలు ఖాళీ చేయించి, బాంబును నిర్వీర్యం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ బాంబులు ఐరోపాలో ఒక ప్రధాన సమస్యగా మిగిలిపోయాయని డ్యూయిష్ వెల్లే పేర్కొంది. వియత్నాం, లావోస్, గాజా, ఉక్రెయిన్ వంటి ఆసియా దేశాలలో, పాతిపెట్టిన బాంబులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి.

బాంబును నిర్వీర్యం చేస్తున్న సమయంలో కూడా పేలిపోయే ప్రమాదం ఉందని హాంకాంగ్ పోలీసులు చెబుతున్నారు. దీని కోసం డిస్పోజల్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాంటి బాంబును నిర్వీర్యం చేయడానికి సమయం, నైపుణ్యం రెండూ అవసరం. ఇదిలావుంటే, రెండవ ప్రపంచ యుద్ధం సెప్టెంబర్ 1, 1939న ప్రారంభమై, సెప్టెంబర్ 2, 1945న ముగిసింది. ఈ యుద్ధం జర్మన్ పోలాండ్ దండయాత్రతో ప్రారంభమైంది. అధికారికంగా జపాన్ లొంగిపోవడంతో ముగిసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *