డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా

డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా


డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా

బాలీవుడ్ నటి మలైకా అరోరా.. ‘స్ప్లిట్స్‌విల్లా X6’ కంటెస్టెంట్ సోరబ్ బేడీ మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని రెండు మూడు రోజులుగా బాలీవుడ్ కోడై కూస్తోంది. అలా కూస్తూనే.. వీరద్దరూ సన్నిహితంగా డ్యాన్స్‌ చూస్తూ.. కౌగిలించుకున్న వీడియోను వైరల్ చేస్తోంది. అంతేకాదు 52 ఏళ్ల మలైకా మలైకా.. 31ఏళ్ల సోరబ్‌తో ప్రమాయణం సాగించడం ఏంటి? ఇలా ఎన్ని ప్రేమాయణాలు సాగిస్తుందనే? కామెంట్లు కూడా బీ టౌన్‌లో కాస్త గట్టిగా రీసౌండ్ చేస్తున్నాయి. అయితే ఇవన్నీ గమనిస్తున్న సోరబ్.. ఈ ప్రేమ రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చాడు. అబ్బేం తమ మధ్య లవ్వు గివ్వూ లేదంటూ సోషల్ మీడియాలో చెప్పేశాడు. ముంబైలోని జుహులో మలైకా అరోరా కొత్తగా ప్రారంభించిన ‘స్వీనీ’ రెస్టారెంట్ పార్టీలో తామిద్దరం కలిసి డాన్స్ చేశామని చెప్పిన సోరబ్.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టుగా వార్తలు వచ్చాయని.. అయితే తమ మధ్య ప్రేమ కాకుండా స్నేహం మాత్రమే ఉందంటూ సోరబ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే సోరబ్‌తో డేటింగ్ పై… మలైకా అరోరా ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.ఇక ఈ విషయం పక్కకు పెడితే.. మలైకా.. డైమండ్ వ్యాపారి హర్ష్ మెహతాతో ఇంతకు ముందు ప్రేమలో ఉన్నారని, రీసెంట్‌గా… వాలెంటైన్స్ డేను ఇద్దరూ ఇటలీలో జరుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సోరబ్‌తో మలైకా సన్నిహితంగా డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో వైరల్ అవడంతో… మలైకా మరో లవ్‌ జర్నీ షురూ చేసిందంటూ… బీటౌన్‌ మీడియా ప్రచారం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. పిస్తా హౌస్‌లో 750 రకాల వంటకాలు బంద్‌

Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా

విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు

చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *