భావ్‌సర్ ధర్మశాలలో మహిళలు, యువతులు గర్బా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు డాన్స్ చేస్తున్న వారి వద్దకు వచ్చి.. ఓ నిమిషం పాటు జాగ్రత్తగా పరిశీలించారు. అంతలోనే.. అక్కడున్న మహిళ వైపు వేగంగా దూసుకొచ్చారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. ఆమెను లాక్కొనిపోయారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ మహిళ.. వారిని అడ్డుకోబోయినా ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. నిమిషాల వ్యవధిలోనే వారు ఆమెు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీస్ బృందాలు చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేసాయి. చివరకు ఆ వాహనాన్ని గుర్తించి అడ్డుకున్నారు. వారి చెర నుంచి ఆ మహిళను రక్షించారు. ఆమె కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఆ మహిళ భర్త మద్యానికి బానిస కావటంతో.. 3 నెలల క్రితం భర్తను వదిలేసి.. మాందసౌర్‌కి చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు.. ఆమె ఆచూకీ కనిపెట్టి.. తిరిగి తమ ఇంటికి తీసుకుపోయే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!
ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం
శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్
వచ్చిందమ్మా వయ్యారి.. కారు బానెట్‌లో భారీ కొండచిలువ
Gold Price: బంగారం ధరలు తగ్గబోతున్నాయా