
రన్నింగ్ ట్రైన్‌లోని వాష్‌రూమ్‌లో ఓ జడ్జి భార్య గుండెపోటు కారణంగా మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన అడిషనల్ జడ్జి రాజ్ కుమార్ చౌహాన్ తన భార్య ఉషతో కలిసి కాచిగూడ, బగత్ కీ కోటి ట్రైన్‌లో ప్రయాణస్తున్నారు. అయితే బుకింగ్ టైంలో ఇద్దరికీ విడివిడిగా బెర్త్‌లు రావడంతో ఇద్దరూ వేరుగావేరుగా కూర్చున్నారు. అయితే వారు దిగాల్సిన గమస్యస్థానం నిమ్బెహర స్టేషన్ రావడంతో దిగే ముందు భార్య వాష్‌రూమ్ వెళ్తానని రాజ్‌కుమార్‌కు చెప్పి వెళ్లింది.
అంతలో రాజ్‌కుమార్ తన లగేజీని తీసుకొని ట్రైన్ దిగేసాడు. అటు వైపు నుంచి భార్య కూడా తన కంటే ముందే ట్రైన్ దిగేసి ఉంటుందని అనుకున్నాడు. కానీ ప్లాట్‌ఫామ్ నుంచి ట్రైన్ వెళ్లిపోయినా భార్య కనిపించకపోవడంతో రాజ్‌కుమార్ ఆమె కోసం స్టేషన్ మొత్తం వెతికాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోయే సరికి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించి ఆమె ట్రైన్ దిగలేదని నిర్ధారించారు.
ఇక వెంటనే నెక్ట్స్ స్టేషన్ సిబ్బంది, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవోర స్టేషన్‌కు ట్రైన్ చేరుకోవడంతో అప్పటికే అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు రాజ్‌కుమార్ భార్య కోసం వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్లు ప్రయాణించిన భోగిలోని వాష్‌రూమ్ డోర్ లాక్ చేసి ఉండడంతో దాన్ని పగలగొట్టి చూశారు. అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయిన ఉన్న ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మరణించినట్టు నిర్ధారించారు. అది విన్న భర్త కన్నీటి పర్యంతమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.