టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI

టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన  AI


టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన  AI

సాధారణంగా ఇంట్లో పని మనుషులపై లేదా వంట చేసే వారిపై నిఘా పెట్టాలంటే గంటల తరబడి సీసీటీవీ ఫుటేజీని కూర్చుని పరిశీలించాలి. ఇది ఎంతో విసుగుతో కూడుకున్న పని. కానీ, బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాత్రం ఈ శ్రమ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన వంట మనిషి చేస్తున్న తప్పులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సదరు టెక్కీ తన వంటింట్లోని కెమెరాను క్లాడ్‌ హైకూ 4.5′ అనే AI టూల్‌కు అనుసంధానించాడు. ఆశ్చర్యకరంగా, ఆ AI కేవలం వీడియో రికార్డ్ చేయడమే కాకుండా, ఆమె ప్రతి కదలికను విశ్లేషించి యజమానికి రాతపూర్వక నివేదికలను పంపింది. ఆ రిపోర్టులో ఏ తేలిందంటే… రోజూ సాయంత్రం 7:12 గంటలకు రాగానే ఫ్రిడ్జ్ తెరిచి, రెండు ఆపిల్స్ తన బ్యాగ్‌లో వేసుకున్నట్లు AI సమయంతో సహా లెక్కగట్టింది. అలాగే డస్ట్‌బిన్ మూత తాకి, ముక్కు రుద్దుకున్న చేతులతోనే చపాతీలు చేయడం వంటి అనారోగ్యకరమైన పనులను క్లియర్‌గా చూపించింది. స్టవ్ వెనుక భాగాన్ని వారం రోజులుగా శుభ్రం చేయలేదని కూడా నివేదించింది. వారానికి ఒకసారి AI పంపే నివేదికలో ఎన్ని ఆపిల్స్, బ్లూబెర్రీలు మాయమయ్యాయో లెక్కలతో సహా చూపించడమే కాకుండా.. “ఈ పనులకి ఆమె నెలకు రూ.4,800 బిల్లు వేస్తోంది” అని యజమానికి గుర్తు చేయడం విశేషం. ఈ రిపోర్టుల ఆధారంగా ఆ టెక్కీ ఆమెను పనిలో నుంచి తొలగించాడు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో, టెక్నాలజీ భవిష్యత్తులో మన వ్యక్తిగత జీవితాలను ఎంత నిశితంగా గమనించబోతుందో అర్థమవుతోంది. “దొంగతనం చేస్తే దేవుడు చూస్తాడో లేదో కానీ, AI మాత్రం ఖచ్చితంగా చూస్తుంది” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు, గంటల కొద్దీ సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసే ఓపిక లేని యజమానులకు ఈ AI స్మార్ట్ అలర్ట్ ఫీచర్ ఒక వరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ స్థాయిలో నిఘా పెట్టడం వల్ల పని మనుషుల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందా అనే చర్చ కూడా నెట్టింట మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు

టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !

Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..

మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్

Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *