
భారత్ తరపున 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక ఆటగాడు గత 3 సంవత్సరాలుగా టీం ఇండియా తరపున ఆడే అవకాశం పొందడం లేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్‌లో తేలిన ఆ ప్లేయర్.. సెంచరీతో తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఈ ఆటగాడు.. విదేశీ గడ్డపై 20 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టి సెంచరీకి చేరాడు. అలాగే సెంచరీ మార్క్‌ను కూడా మయాంక్ అగర్వాల్ సిక్స్‌తో పూర్తి చేశాడు.
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ ఇంగ్లాండ్‌లో అద్భుతంగా రాణించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1లో యార్క్‌షైర్ తరపున ఆడుతూ, డర్హామ్‌పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతని డొమెస్టిక్ కెరీర్లో 19వ సెంచరీ. మయాంక్ అగర్వాల్ ఇంగ్లాండ్‌లో తన తొలి సెంచరీని 120 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ షఫీకుల్లా గఫారి బౌలింగ్‌లో సిక్స్ కొట్టి తన సెంచరీని పూర్తి చేశాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత, అతను తన రెండవ మ్యాచ్‌లో 195 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో సహా 175 పరుగులు చేసి అద్భుతమైన పునరాగమనం చేశాడు.
మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌తో యార్క్ షైర్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. డర్హామ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకే ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. గతంలో దేశవాళీ క్రికెట్లో కూడా అతను బాగా రాణించాడు.
2022లో శ్రీలంకతో స్వదేశంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన మయాంక్ అగర్వాల్ టెస్ట్ క్రికెట్లో అసాధారణ ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పటివరకు టీం ఇండియా తరపున 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 36 ఇన్నింగ్స్‌లలో, అతను 41.33 సగటుతో 1488 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీమిండియా తరపున ఐదు వన్డేలు కూడా ఆడాడు మయాంక్ అగర్వాల్. అయితే, ఆ మ్యాచ్‌లలో అతను బాగా రాణించలేదు. 17.20 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతను 114 మ్యాచ్‌ల్లో 43.41 సగటుతో 8251 పరుగులు చేశాడు. వాటిలో 19 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.