టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్


టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: కంటెంట్ కోసం భారీ బడ్జెట్

టాలీవుడ్‌లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు.. హీరోల మార్కెట్‌తో పని లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్మి నిర్మాతలు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్‌గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే.. ఒక్కోసారి ఆడియన్స్‌కే కంగారు పుడుతుంది. నాని మార్కెట్‌తో సంబంధం లేకుండా, వస్తున్న సినిమా ది ప్యారడైజ్. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు 120 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. మేకర్స్ పడుతున్న కష్టం, సినిమా కోసం పెడుతున్న నాని కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి. కేవలం కథపై ఉన్న నమ్మకంతో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ఈ ప్రయోగం.. స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా.. మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రణబాలి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతుంది. సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లోనూ అద్భుతమైన విజువల్స్ కనిపిస్తూ.. వాళ్ళు ఖర్చు స్క్రీన్ మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఇది హిట్టైతే రౌడీ బాయ్ మేనియా మళ్లీ మొదలైపోయినట్లే. సెప్టెంబర్ 11న రానుంది రణబాలి. నిర్మాతలు గుడ్డిగా కాకుండా కంటెంట్‌ను బలంగా నమ్మి చేస్తున్న ఈ ప్రయోగాలు రేపు థియేటర్లలో వర్కవుట్ అయితే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ సినిమాలు గానీ హిట్ కొడితే.. టాలీవుడ్‌లో మన మీడియం రేంజ్ హీరోలంతా పక్కాగా మరో మెట్టెక్కుతారు. మొత్తానికి కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే బడ్జెట్ మ్యాటరే కాదంటున్నారు నిర్మాతలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాతర.. ఇది మాస్ జాతర అంటున్న స్టార్ హీరోలు

కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?

Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *