ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సిద్ధు పేరు మారుమోగింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. వరుసగా హిట్లతో దూసుకుపోతున్న సమయంలోనే జాక్ సినిమా ఊహించని రిజల్డ్ ఇచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో సిద్ధు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది. ఈ టాక్ పైనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు సిద్దు జొన్నలగడ్డ. ప్రస్తుతం సిద్ధు నటించిన తెలుసు కదా సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు ఈ స్టార్ బాయ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జాక్ సినిమా నిజంగానే ఆడలేదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ విషయంలో తనకు బాధ వేసిందని.. అందుకే రూ.4.75 కోట్లు అప్పు చేసి మరీ ప్రొడ్యూసర్‌కు తిరిగి ఇచ్చేశానంటూ చెప్పాడు. అప్పుడు తన చేతిలో డబ్బులు లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చిదన్నాడు. తన జాన్ సినిమాతో కొందరు నష్టపోయారని..అది తనకు నచ్చలేదు. అందుకే అప్పు చేసినా పర్లేదని.. వాళ్లకు డబ్బులు ఇచ్చేశానంటూ చెప్పాడు ఈ హీరో. అయితే డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు కానీ.. ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచనే తనను విసిగిస్తోందంటూ చెప్పుకొచ్చాడు ఈ హీరో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్‌కు కలిసొచ్చిన ఉదయ్ తప్పుడు నిర్ణయం !! అప్పట్లో ఏం జరిగిందంటే..?
బిగ్ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్!
కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు
బిగ్ బాస్ దిమ్మతిరిగే చక్రవ్యూహం.. దెబ్బకు గుక్కపెట్టి మరీ ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
కొడుకు సిరీస్ వల్ల.. షారుఖ్‌కు 2 కోట్ల కష్టం