జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..

జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..


రైతు పండించే అన్ని పంటలు వారికీ కలిసి రావు. అయితే, కొన్ని మాత్రం పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తాయి. అధిక లాభాలు వచ్చేలా చేస్తాయి. జనుము పంట గురించి అందరికి తెలిసే ఉంటుంది. అయితే, దీనికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మూడు వేలు పెట్టి కేజీ విత్తనాలు కొంటే మీకు ఎకరాకు రూ. 80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుంది.

ఈ పంటను ఎలా పండించాలంటే?

వరి పంటను పండించే సమయంలోనే దీని విత్తనాలను వేసుకోవాలి. అంటే ఖరీఫ్‌ పంటల సమయంలో సీడ్స్ ను వేస్తే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత వేసుకుంటే దిగుబడి రాదు. వరి పంటను కోసిన తర్వాత , 10 రోజుల తర్వాత జనుము సీడ్స్ మొలకెత్తుతాయి.
మన దగ్గర ముందే వీటి విత్తనాలు ఉంటే ఒక్క రూపాయి కూడా వీటికి పెట్టాల్సిన అవసరం లేదు. రైతులకు కాసులు వర్షం కురుస్తుంది. ఈ పంటను వేసిన రైతులు ఎక్కడా కూడా నష్ట పోలేదు.

కొన్ని చోట్ల రైతులు ఖరీఫ్‌ పంట వేసిన తర్వాత ఈ జనుము పంటను సాగు చేస్తారు. ఇక ఇప్పుడు ఇది కొన్ని ప్రదేశాల్లో పూతదశలో ఉంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా మందుల అవసరం కూడా లేకుండా ఇది మంచిగా పండుతుంది. మీరు విత్తనాల కోసం రూ. 3 వేలు పెడితే పంట రేట్ ను బట్టి ఎకరాకు లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఇప్పుడు మార్కెట్లో కిలో జనుము రూ. 60 నుండి రూ.100 వరకు అమ్ముతున్నారు. మినప, కంది సాగు కన్నా కూడా జనుము సాగు చాలా మంచిది. మినప, మిరప మొక్కలు పూతలోనే దెబ్బతింటాయి. దీనికి అలాంటి బాధలు ఏం ఉండవు. ఈ జనుము పంటకు తెగులు కూడా రాదు. అన్ని పంటల కంటే జనుము పంటకి అధిక లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *