ఆస్ట్రేలియా-ఏతో రెండవ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రేయాస్ చివరి నిమిషంలో జట్టు నుండి వైదొలగడంతో ఆస్ట్రేలియా-ఏతో రెండవ రెడ్-బాల్ మ్యాచ్ కు ఇండియా-ఏ కెప్టెన్ గా ధ్రువ్ జురెల్ ను నియమించారు. అయితే ఇంత సడెన్‌గా అయ్యర్ ఎందుకు జట్టు, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో అయ్యర్ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించలేదు. అయ్యర్ తన వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా-ఏతో జరిగే రెండవ నాలుగు రోజుల మ్యాచ్‌లో తాను ఆడలేనని అయ్యర్ సెలెక్టర్లకు తెలియజేసినట్లు సమాచారం. అయితే వెస్టిండీస్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు సమావేశమైనప్పుడు అతను మిడిల్ ఆర్డర్‌లో స్థానం కోసం పోటీలో ఉంటాడని కూడా తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్ వరుసగా 8, 13 పరుగులు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో అయ్యర్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలి కావాల్సి వచ్చింది. అయ్యర్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ గత మ్యాచ్‌లో ఇండియా-ఏ బాగా రాణించింది. ఆస్ట్రేలియా 532 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత జట్టు 531 పరుగులు చేసింది.
కాగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియాలో అయ్యర్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 కూడా అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదగడానికి అయ్యర్ ప్రయత్నిస్తున్నా.. అయ్యర్‌కు అదృష్టం కలిగి రావడం లేదు. గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్ ఇప్పటికే వన్డే క్రికెట్‌లో జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి