
తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో దారుణం జరిగింది. ఇంట్లో తాగిన మత్తులో ఉన్న తండ్రి తన కన్నకూతురిని చంపేశాడు. పదే పదే నేలకేసి కొట్టడంతో శనివారం ఒక ఏడాది వయసున్న బాలిక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వెంకటేష్ అర్ధరాత్రి సమయంలో తాగిన మత్తులో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఏడాది వయసున్న చిన్నారి ఏడ్వడం ప్రారంభించింది. తల్లి ఎంత ఓదార్చినా చిన్నారి ఏడుపు ఆపలేదు.
మద్యం మత్తలో ఉన్న వెంకటేష్ కోపంతో ఆ పాప కాళ్ళను పట్టుకుని పదే పదే నేలకు కొట్టాడు, భార్య ఆపేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వెంకటేష్ ఆగలేదు. చిన్నారిని నేలకేసి కొట్టడంతో బాలిక తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు చిన్నారిని సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే భావిగ్న మరుసటి రోజు ఉదయం చికిత్స పొందుతూ మరణించింది. వెంకటేష్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ పొరుగువారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి