ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ప్రతిభావంతులైన నిపుణులను, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (STEM) రంగాలను ఆకర్షించే లక్ష్యంతో చైనా కొత్త K వీసా కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. చైనాలోకి విదేశీయుల రాకపోకల నిర్వహణపై నిబంధనలను సవరిస్తూ.. అక్టోబర్ 1, 2025 నుండి ఈ కే వీసాను అమలులోకి తేనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వర్క్ వీసా నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో చైనా K వీసా తీసుకోరావడం సంచలనంగా మారింది.
ఈ వారం ప్రారంభంలో అమెరికా H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల వార్షిక రుసుమును విధించింది. ఇది భారతీయ టెకీలలో, ఐటీ సంస్థలలో ఆందోళనను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో చైనా కొత్త వీసా నిబంధనంలపై విదేశీ నిపుణులను, ముఖ్యంగా దక్షిణాసియా నుండి, ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను కోరుకునే వారిని ఆకర్షించడానికి ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
చైనా న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం.. K వీసా విదేశీ యువ శాస్త్రీయ, సాంకేతిక ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది. వారు చైనా లేదా విదేశాలలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల నుండి STEM రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీతో పట్టభద్రులైన వారు అప్లై చేసుకోవచ్చు. అటువంటి సంస్థలలో బోధన లేదా పరిశోధనలో నిమగ్నమైన యువ నిపుణులకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు చైనీస్ అధికారులు నిర్దేశించిన అర్హతలు, అవసరాలను అనుగుణంగా పత్రాలను సమర్పించాలి.
K వీసా ముఖ్య లక్షణాలు
చైనాలో ప్రస్తుతం ఉన్న 12 సాధారణ వీసా వర్గాలతో పోలిస్తే K వీసా గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. చాలా వర్క్ వీసాల మాదిరిగా కాకుండా, దరఖాస్తుదారులు దేశీయ యజమాని లేదా సంస్థ నుండి ఆహ్వానం జారీ చేయవలసిన అవసరం ఉండదు, దీని వలన ప్రక్రియ తక్కువ నియంత్రణ కలిగి ఉంటుంది. చైనాలోకి ప్రవేశించిన తర్వాత K వీసాదారులు వ్యవస్థాపక, వ్యాపార కార్యకలాపాలతో పాటు విద్య, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీలో విద్యా మార్పిడిలో పాల్గొనడానికి అనుమతి ఉంటుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి