చైనా ఆపిల్ నుంచి మరో సంచలనం.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Xiaomi 17 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?

చైనా ఆపిల్ నుంచి మరో సంచలనం.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Xiaomi 17 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?


భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్ క్రేజ్ జోరుగా సాగుతుంది. సెప్టెంబర్ 19న లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను కొనేందుకు జనాలు ఆపిల్ స్టోర్‌ల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చైనా ఆపిల్‌గా పిలువబడే షియోమి తన ప్రీమియం సెగ్మెంట్‌ 17 సిరీస్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ సెప్టెంబర్ 30న లాంచ్‌కానున్నట్టు పేర్కొంది. షియోమి నుంచి వచ్చే ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ప్రీ-బుకింగ్స్‌ ఇప్పటికే చైనాలో ప్రారంభమయ్యాయి. షియోమి 17తో పాటు, షియోమి 17 ప్రో, షియోమి 17 ప్రో మాక్స్ కూడా ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి.

ఈ Xiaomi స్మార్ట్‌ఫోన్ సిరీస్ Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో సంస్థ కెమెరాను హైలెట్‌ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో Xiaomi మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఫీచర్‌ ఫోన్‌ బ్యాక్‌సైడ్‌ కెమెరాస్‌తో పాటు సెకండరీ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. ఈ సెకండరీ డిస్‌ప్లే కాల్ నోటిఫికేషన్‌లు లాంటి అనే రకాలుగా ఉపయోగపడుతుంది.

Xiaomi 17 సిరీస్ ఫీచర్లు ఏమిటి?

ఈ ఫోన్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే.. ఈ Xiaomi 17 స్మార్ట్‌ఫోన్ సిరీస్ Xiaomi 15 సిరీస్‌కి అప్‌గ్రేడ్‌గా తీసుకువస్తాఉన్నారు. కంపెనీ 15 తర్వాత డైరెక్ట్‌గా 17 సిరీస్‌ను లాంచ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో శక్తివంతమైన కెమెరాతో పాటు అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్స్‌ ఉంటాయి. ఇది Android 16 ఆధారంగా HyperOS 3పై కూడా రన్ అవుతుంది. ఇటీవలి లీక్ ప్రకారం, Xiaomi 17 Pro 6.3-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో పాటు 6,300 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్యాక్‌సైడ్‌ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్‌ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది.

Xiaomi Mi 17 స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే ఇందులో 6.3-అంగుళాల 1.5K LTPO OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ ఉండనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇది కూడా మూడు 50MP కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. వీటి ధర, ఇతర వివారాలను కంపెనీ ఇంకా రిలీజ్ చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *