చైనాలో రాగసా టైఫూన్ ఎఫెక్ట్.. ఓ వైపు నగరాలు ఖాళీ.. రోడ్లు జలమయం.. చేపలు పడుతున్న ప్రజలు

చైనాలో రాగసా టైఫూన్ ఎఫెక్ట్.. ఓ వైపు నగరాలు ఖాళీ.. రోడ్లు జలమయం.. చేపలు పడుతున్న ప్రజలు


చైనా నుంచి హాంకాంగ్ వరకు సూపర్ టైఫూన్ రాగసా విధ్వంసం సృష్టించింది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలకు అనేక మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. అనేక మంది గల్లంతయ్యారు. ఈ విధ్వంసకర తుఫాను మకావుతో సహా అనేక ప్రదేశాలలో రోడ్లను చెరువులుగా మార్చింది. ఇంతలో నివాసితులు ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని చూశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . మకావు వీధుల్లో వరదలు నీరు పోటెత్తింది. ఈ వరద నీటికి పెద్ద చేపలు రోడ్డుమీదకు కొట్టుకు వచ్చాయి. దీంతో చేపలను పట్టుకోవడానికి ప్రజలు వలలు, ప్లాస్టిక్ సంచులతో నిలబడి ఉన్నారు.

వైరల్ వీడియోలో వరదలు వచ్చిన వీధుల్లో ప్రజలు చేపల వలలు, ప్లాస్టిక్ సంచులతో చేపలను పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో కనిపిస్తుంది. కొంతమంది తమ సైకిళ్లపై చేపలను లోడ్ చేస్తున్నట్లు కనిపించగా, మరికొందరు తాము పట్టుకున్న చేపలతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. షాంఘై డైలీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో మకావు వీధుల్లో స్థానికుల భారీ సమూహం భారీ సంఖ్యలో చేపలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. కొందరు వరద నీటిలో కొట్టుకు పోతున్న చేపలను పట్టుకోవడంలో విజయం సాధించారు కూడా.

ఇవి కూడా చదవండి

మకావు వీధులను ముంచెత్తిన సముద్రపు నీరు

టైఫూన్ రాగసా తర్వాత మకావు వీధుల్లో సముద్రపు నీరు మునిగిపోయింది. ఇప్పుడు నివాసితులు ఆ నీటిలో నుంచి పెద్ద చెరువులో చేపలు పట్టుకున్నట్లు పట్టుకున్నారు అని వీడియోకి ఒక క్యాప్షన్ జత చేశారు. 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటికే 250,000 కంటే ఎక్కువ వ్యూస్ ని సొంతం చేసుకుంది. వేలాది లైక్‌లు, వివిధ రకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో చూసిన ఒకరు మకావు వీధులు వరదల్లో మునిగి నగరం మొత్తం అక్వేరియం లా మారిపోయింది. ప్రజలు చేపలు పట్టుకున్నారని కామెంట్ చేశారు. టైఫూన్ రాగసా వర్షాన్ని మాత్రమే కాకుండా ఆహార ప్రణాళికలను కూడా తెచ్చిపెట్టింది. విపత్తు సముద్ర ఆహార బఫేగా మారుతుందని ఎవరికి తెలుసు?” అదేవిధంగా, మరొకరు మకావులో వరదలు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా అందరూ మత్స్యకారులు అవుతారని కామెంట్ చేశాడు. టైఫూన్ రాగస వీధులను సీ ఫుడ్ బఫేగా మార్చింది. అది కూడా బుకింగ్ అవసరం లేకుండానే.” మరొకరు కామెంట్ చేశాడు. “ఇక్కడ చేపలు అందరికీ ఉచితం. ఇది ఒక అద్భుతమైన దృశ్యం.”

వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *