చిన్నపిల్లల వినికిడి సమస్యపై WHO షాకింగ్ రిపోర్ట్.. ఇలా చేస్తే 60% సమస్య తగ్గించవచ్చట!

చిన్నపిల్లల వినికిడి సమస్యపై WHO షాకింగ్ రిపోర్ట్.. ఇలా చేస్తే 60% సమస్య తగ్గించవచ్చట!


ప్రపంచవ్యాప్తంగా సుమారు 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇందులో లక్షలాది మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే, ఒక ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. పిల్లల్లో వచ్చే వినికిడి లోపాన్ని 60 శాతం వరకు ముందుగానే నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం వారి మాట, చదువు, సామాజిక జీవితం దెబ్బతినే ప్రమాదం ఉందనీ WHO అంటుంది. వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా WHO అందించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

పిల్లల్లో వినికిడి లోపం అనేది కేవలం చెవులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది వారి జీవితాన్నే ప్రభావితం చేస్తుంది. ఈ లోపం వల్ల మాట తీరు సరిగ్గా రాదు, భాషను నేర్చుకోవడంలో, స్పష్టంగా మాట్లాడటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి పిల్లలతో కలవలేక, సామాజికంగా వెనుకబడిపోతారు. తరగతి గదిలో పాఠాలు అర్థం కాక చదువులో వెనుకబడిపోయే అవకాశం ఉంది.మరి పిల్లలో ఈ లోపం ఎలా గుర్తించాలి. చెప్పిన మాటను పదే పదే అడగటం, పిలిచినా పలకకపోవడం లేదా ఏకాగ్రత లోపించడం. రెగ్యులర్ గా చెవిలో నొప్పి లేదా చెవి నుంచి నీరు లాంటిది కారడం లాంటివి ప్రధాన లక్షణాలు.వీటి తో పాటు.. మాటలు రావడం ఆలస్యం కావడం, టీవీ లేదా ఫోన్ సౌండ్ ఎక్కువగా పెట్టుకుని చూడటం లాంటివి మనం పిల్లలో గమనించ వలసిన అంశాలు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సూచనల ప్రకారం.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య దరిచేరదనీ నిపుణులు మాట..హెడ్‌ఫోన్స్, లౌడ్ స్పీకర్ల వాడకాన్ని తగ్గించాలి. పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకకుండా సకాలంలో ఇమ్యునైజేషన్ చేయించాలి.తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ వినికిడి ఆరోగ్యంగా ఉండేలా చూడవచ్చు.ఒక వేళ పుట్టి బిడ్డ చెవి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. మీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే వారి ఆరోగ్యమే మన మొదటి ప్రాధాన్యత కావాలి. చిన్నపాటి జాగ్రత్తలతో వినికిడి లోపాన్ని జయించవచ్చు. విందాం.. వినిపిద్దాం.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ who పిలిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *