కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరమైపోయారు రాశీ ఖన్నా. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ లాంటి సినిమాలు చేసినా పెద్దగా యూజ్ కాలేదు.
ప్రస్తుతం తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్‌లతో కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు రాశీ. వీటిలో ఈమె లుక్ అదిరిపోయింది.. ముఖ్యంగా గతం కంటే బరువు బాగా తగ్గిపోయారు ఈ బ్యూటీ.
కీర్తి సురేష్ సైతం మేకోవర్‌పై బాగా ఫోకస్ చేసారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండి ముద్దుగా కనిపించిన కీర్తి.. ఈ మధ్య బాగా గ్లామర్ షో చేస్తున్నారు. అందుకే బరువు తగ్గి బక్కచిక్కి.. సన్నగా మెరుపుతీగలా మారిపోయారు. మొన్న ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై కీర్తి మేకోవర్ చూసి ఫిదా అయిపోయారంతా. పైగా గ్లామర్ షో కూడా అదే స్థాయిలో ఉంది.
కెరీర్ మొదట్నుంచీ బొద్దుగానే ఉన్న బ్యూటీ నిత్య మీనన్..! ధనుష్ తిరు సినిమాలో మరింత బరువు పెరిగారు. అయితే కొన్నాళ్ళుగా ఈమె ఫిజిక్‌పై ఫోకస్ చేసారు.
గతంతో పోలిస్తే చాలా వరకు బరువు తగ్గిపోయారు. తాజాగా ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాలో వెయిట్ లాస్ అయి కనిపించారు ఈ బ్యూటీ. అందుకేగా అనేది.. చక్కనమ్మా చిక్కినా అందమే అని..!