వైష్ణవి చైతన్య.. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టా రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది.
యూట్యూబ్ లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు, ఇన్ స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది, బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.
బేబీ తర్వాత లవ్ మీ, జాక్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో మరిన్ని చిత్రాలతో బిజీగా ఉంది. పదిహేనేళ్ల వయసులోనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది వైష్ణవి. ఇక ఇప్పుడు ఎపిక్ అనే సినిమా చేస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తుంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో గ్లామరస్ లుక్ లో కనిపించి కవ్వించింది వైష్ణవి. గ్లామర్ డోస్ పెంచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.




