
గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పనుల కంటే ‘కోతుల పంచాయతీ’లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో “గెలిపిస్తే కోతుల బెడద వదిలిస్తాం” అని హామీ ఇచ్చిన సర్పంచ్‌లకు, ఇప్పుడు ఆ వాగ్దానమే ఉరితాడులా మారింది. వానర సేన దాడులతో జనం బేజారవుతుండటంతో, సర్పంచ్‌లు సొంత ఖర్చులతో మంకీ క్యాచర్లను రంగంలోకి దించుతున్నారు. ఒక గ్రామంలో కోతులను పట్టించి పక్కనే ఉన్న అడవుల్లో లేదా గుట్టలపై వదిలేస్తుంటే, అవి మళ్ళీ సమీపంలోని మరో గ్రామంపై పడుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య కొత్త వివాదాలు మొదలవుతున్నాయి. భీమదేవరపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టిన కోతులను స్థానిక బూడిదగుట్టపై వదిలేయడంతో, ఆ కోతులన్నీ భీమదేవరపల్లి మేజర్ గ్రామ పంచాయతీపై దండెత్తుతున్నాయి. ఇక్కడ కోతుల బెడద తారస్థాయికి చేరడంతో, సర్పంచ్ కుమారస్వామి ప్రత్యేక బృందాలను పిలిపించారు. ఇప్పటివరకు సుమారు 400 కోతులను పట్టించి, బోన్లలో బంధించి సుదూర ప్రాంతాల్లోని అడవులకు తరలిస్తున్నారు. కోతుల బెడదతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది గ్రామస్తులకు. కోతుల గుంపులు పొలాలపై పడి పంటలను చిన్నాభిన్నం చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాదు, ఇళ్లలోకి దూరి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. పరిసర గ్రామాల వారు తమ ప్రాంతం వద్ద కోతులను వదిలి వెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులను తరలించడం తాత్కాలిక పరిష్కారమే కానీ, శాశ్వత మార్గం కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ సమస్య నుండి విముక్తి ఎప్పుడో అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్