గ్రామాల మధ్య మొదలైన కొత్త పంచాయతీ.. తలలు పట్టుకుంటున్న కొత్త సర్పంచులు..!

గ్రామాల మధ్య మొదలైన కొత్త పంచాయతీ.. తలలు పట్టుకుంటున్న కొత్త సర్పంచులు..!


పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రధాన ఎజెండాగా మారిన కోతుల సమస్య ఇప్పుడు సర్పంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గెలిపిస్తే కోతులను ఊళ్ళ నుండి తరిమేస్తామని హామీ ఇచ్చిన సర్పంచులు ఇప్పుడు కోతుల బెడద నుండి ఊళ్ళకు విముక్తి కల్పించడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మంకీ క్యాచర్స్‌తో కోతులను పట్టించి సమీప అడవుల్లో వదిలేస్తున్నారు. ఆ కోతులు పొరుగు గ్రామాలపై పడడంతో కొత్త పంచాయతీ మొదలవుతుంది.

గ్రామాల్లో ఇప్పుడు కోతుల సమస్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పంటలను చిన్నాభిన్నం చేస్తున్న కోతులు ఊళ్ళలో జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వానర సేనల మూకుమ్మడి దాడులతో ఊళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జనం అంతా బేజారైపోతున్నారు. ఆ కోతులను తరిమెందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు పడరాని పాట్లు పడుతున్నారు. వాటిని పట్టి అడవుల్లోకి సాగనంపుతున్నారు. గెలిపిస్తే కోతుల లేకుండా చేస్తామని గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన సర్పంచులు ఇప్పుడు కోతులను తరిమే పనిలో పడ్డారు.. ఆయా గ్రామాల్లో పట్టిన కోతులను సమీప అడవుల్లో వదిలేస్తున్నారు. ఆ కోతులు పక్కనే ఉన్న ఊర్లపై పడడంతో అక్కడ కొత్త సమస్య మొదలవుతుంది. కోతుల మధ్య బీకర యుద్ధం కొనసాగుతుంటే వాటిని ఎలా సాగనంపాలో తెలియక సర్పంచులు, గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా హనుమకొండ లోని భీమదేవరపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో కోతుల బెడద విపరీతంగా మారింది. ఈ మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టిన కోతులను భీమదేవరపల్లి పక్కనే ఉన్న బూడిదగుట్టపై వదిలేస్తున్నారు. ఆ కోతులన్నీ ఇప్పుడు భీమదేవరపల్లి గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.భీమదేవరపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు కోతుల బెడద నుండి తమకు విముక్తి కల్పించాలని వేడుకోవడంతో సర్పంచ్ కుమార స్వామి కోతులను పట్టించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మంకీస్ క్యాచర్స్‌తో వాటిని పట్టి అడవుల్లోకి సాగనంపుతున్నారు. ఈ క్రమంలోనే మంకీస్ క్యాచర్స్‌ను పిలిపించి సుమారు నాలుగు వందల కోతులను పట్టించారు.. వాటిని బోనులో బంధించి దూరంగా అడవుల్లోకి వదులుతున్నారు.

పరిసర గ్రామాల ప్రజలు మా గ్రామ పంచాయతీ పక్కనే ఉన్న బూడిదిగట్టులో కోతులను వదిలిపెట్టడంతో కోతుల సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ కోతుల వల్ల పంట నష్టంతో గ్రామస్తులకు మానసిక ప్రశాంతత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *