
భారతీయులు ఏదైనా సమస్య వస్తే కుంగిపోకుండా, ఉన్నంతలోనే మార్గాలను వెతుక్కోవడంలో సిద్ధహస్తులు. అందుకే మన దేశంలో జుగాడ్’ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా గ్యాస్ సిలిండర్ల కొరత వార్తల నేపథ్యంలో ఒక వ్యక్తి రోటీలు కాల్చడానికి కనిపెట్టిన మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సాధారణంగా గ్యాస్ అయిపోతే మనం ఇండక్షన్ స్టవ్ లేదా బయట హోటల్ నుండి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న ఇస్త్రీ పెట్టెనే స్టవ్‌గా మార్చేశాడు. ఐరన్ బాక్స్‌ను వెల్లకిలా పడుకోబెట్టి, దాని వేడి మీద రోటీని వేసి కాల్చడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా ఆ రోటీ మామూలు స్టవ్ మీద కాలినట్టే చాలా చక్కగా తయారైంది.
ఎక్స్ (ట్విట్టర్) యూజర్ @Shoonya_ydv షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రోటీ అయితే బాగానే వస్తోంది కానీ, కూర వండటానికి ఇంకో జుగాడ్ వెతకాల్సిందే అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించగా, నిజమైన భారతీయుడు ఎప్పుడూ ఆపదలో అవకాశం కోసం వెతుకుతాడు అనడానికి ఇదే నిదర్శనం అని మరొకరు పేర్కొన్నారు. ఈ టెక్నిక్ అస్సలు దేశం దాటి వెళ్లకూడదు అని కొందరు జోకులు వేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ऐसे कंटेंट क्रियेटर सरकार की बदनामी करा रहे हैं….इन पर देशद्रोह का केस लगना चाहिए —
#LpgGasCrisisIndia pic.twitter.com/tDrwFUPAid
— Shoonya (@Shoonya_ydv) March 12, 2026
ఇకపోతే, ఈ వీడియో చూడటానికి సరదాగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద రిస్క్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్‌లు బట్టలు ఇస్త్రీ చేయడానికి తయారు చేసినవి. వాటిపై ఆహార పదార్థాలు వండటం వల్ల మెటల్ బాడీ నుండి విద్యుత్ ప్రసరించి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే అధిక వేడి వల్ల ఐరన్ బాక్స్ పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి సాహసాలు ఇంట్లో ప్రయత్నించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఏదేమైనా, ఈ వింతైన రోటీ మేకర్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…
