ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 27 తేదీన దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. పశ్చిమగోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌కు వర్ష సూచన చేశారు. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడా మోస్తరు వర్షం కురుస్తుందని, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి
డాన్స్ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..
Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!
ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం
శాకాహారిని..నాతో చికెన్ తినిపించారు.. నటి ఫైర్