లక్ష్మీదేవి – శుక్రుని ప్రతిరూపం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విలాసాలకు కారకుడైన శుక్ర గ్రహానికి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే వీటిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
విరిగిన గాజులు ధరిస్తున్నారా: చాలామంది మహిళలు తమకు ఇష్టమైన గాజులు కొద్దిగా పగిలినా లేదా విరిగినా, వాటిని అలాగే ధరిస్తుంటారు. లేదా తర్వాత బాగు చేయించవచ్చని భావిస్తారు. విరిగిన గాజులు ధరించడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుందని, ఇది భర్త ఆరోగ్యానికి కూడా హానికరమని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ గాజు విరిగిపోతే, దానిని నిర్లక్ష్యంగా పడేయకుండా ఏదైనా చెట్టు మొదట్లో ఉంచడం మంచిది.
మంచం మీద కూర్చుని వద్దు: గాజులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే మంచం మీద కూర్చుని గాజులు వేసుకోవడం లేదా తీయడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయని, ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు.
బహుమతిగా వస్తే గౌరవించండి: ఎవరైనా మనకు ప్రేమతో గాజులను బహుమతిగా ఇస్తే వాటిని ఒక వస్తువులా కాకుండా వారి ఆశీర్వాదంగా భావించాలి. వాటిని ఇతరులకు ఇవ్వడం లేదా పారేయడం చేయకూడదు. కనీసం ఒక్కసారైనా ఆ గాజులను ధరించి వారి ఆప్యాయతను గౌరవించాలి.
దానం చేసేటప్పుడు జాగ్రత్త: దానం చేయడం మంచిదే.. కానీ పాతవి లేదా మురికిగా ఉన్న గాజులను ఇతరులకు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైనా సరే కొత్త మరియు నాణ్యమైన వస్తువులనే దానం చేయాలి.




