జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే నేడు కొన్ని గ్రహణాల కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసి వస్తుందంట. కాగా, ఏ రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి : ఈ రాశి వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి విహార యాత్రలకు చేద్దాం అనుకుంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా రోజుల నుంచి బాధపెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కన్యా రాశి : ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. విద్యార్థులు చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. భాగస్వామ్య ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక మొత్తంలో ధనార్జన చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు చాలా రోజుల నుంచి ఏవైతే కలలు కంటున్నారో వాటిని నిజం చేసుకుంటారు. వ్యాపారస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. ప్రతి ఒక్కరూ ఈ నెల మొత్తం సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి : రాశిలో జన్మించిన వ్యక్తులకు అక్టోబర్ నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు నుంచి వీరి కెరీర్ అద్భుతంగా సాగిపోతుంది. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.. అలాగే జీవితంలో ఆనందం పెరగడం, ఆకస్మిక ధనలాభం కలగడం జరుగుతుంది.