ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!


ఖమ్మంలో హైడ్రామా.. కవిత నిరాహారదీక్ష భగ్నం.. కవితతో పాటు ఆందోళనకారుల అరెస్ట్!

ఖమ్మంలో కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం భూదాన్ బాధితులను పరామర్శించిన కవిత.. అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో కవిత చేస్తు్న్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్‌ చేశారు. సోమవారం (మార్చి 09) రాత్రి నుంచి వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కవిత సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు, బాధితుల మధ్య జరిగిన తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత పరామర్శలు, ధర్నాలు, ఆందోళన తర్వాత ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో నిరాహార దీక్షకు దిగారు కవిత. అంతేకాదు, బాధితులకు న్యాయం జరిగేవరకు దీక్ష విరమించేదే లేదన్నారు. దీంతో అర్థరాత్రి హైడ్రామా నడుమ కవితతోపాటు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మహిళా పోలీసులపై దాడులు చేసినవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఖమ్మం ఏసీపీ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *