ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో రహస్య వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతున్నాయి. గత నెల రోజుల్లో 40 కంటే ఎక్కువ గేదెలు చనిపోయాయి. పెద్దేవం గ్రామంలో మాత్రమే 10 రోజుల్లో 10 గేదెలు మృతి చెందాయి. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి, గ్రామంలో పర్యటించి నమూనాలను సేకరించారు. అలాగే పలు గ్రామాల్లోని పాడి రైతులను అప్రమత్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు కూడా పెద్దేవం గ్రామాన్ని సందర్శించి, గేదెల మృతికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు తగిన సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు
లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు
RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా
తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు
50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తాం