సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కొబ్బరిబోండాల లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై కొబ్బరిబోండాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొబ్బరి బోండాల కోసం ఎగబడ్డారు. ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు సాయం చేయాల్సింది పోయి, రోడ్డుపై పడిన కొబ్బరి బొండాలను ఏరే పనిలో మునిగిపోయారు. కొందరు చేతికి అందిన బోండాలను పట్టుకుపోగా.. ఇంకొందరు సంచుల్లో, బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తరలించారు. ఆ మార్గంలో వచ్చిన కారు ప్రయాణికులు సైతం.. ఆగి మరీ బోండాలను కారు డిక్కీల్లో నింపుకుపోయారే తప్ప లారీ డ్రైవర్, ఇతర సిబ్బంది బాగోగులు ఆరా తీయలేదు. ప్రమాదం కారణంగా.. రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసి రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..
విమానంలో ఎలుక.. కేకలు పెట్టిన ప్రయాణికులు
సూర్యుడిని రెండుగా చీలుస్తూ నింగికి ఎగిసిన ఫాల్కన్.. అదిరిపోయే ఫొటోను చూసారా