ఓవైపు మధ్యబంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండగా మరోవైపు సెప్టెంబరు 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది సెప్టెంబర్27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :