
బీహార్‌లోని గయ జిల్లాలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. రీల్స్ షుట్ చేస్తుండగా తొమ్మిది మంది యువకులు నదిలో పడి మునిగిపోయారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. కానీ, వారు పోలీసులు వచ్చేలోపుగానే స్థానికులు వారందరినీ రక్షించారు. ప్రథమ చికిత్స కోసం యువకులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. .
గురువారం సాయంత్రం గయా జిల్లాలోని ఖిజ్రసరై పోలీస్ స్టేషన్ పరిధిలోని కెన్నీ బ్రిడ్జి సమీపంలో తొమ్మిది మంది యువకులు సరదాగా షికారు చేయడానికి వెళ్లారు. అక్కడ వారంతా సరదాగా గడుపుతున్నారు. కొందరు కెమెరాలతో రీల్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి మునిగిపోయారు. వారంతా మొదట నది ఒడ్డున తమ మొబైల్ ఫోన్లతో రీల్స్ తయారు చేస్తున్నారు. వారిలో కొందరు మరింత లోతైన నీటిలోకి వెళ్లారు. వారు నీటిలో దూకుతుండగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవటంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. తమ స్నేహితులను చూసి ఒడ్డున ఉన్న యువకులు వారిని రక్షించడానికి నదిలోకి దూకారు. వారు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. నదిలోకి దిగిన తొమ్మిది మంది యువకులు ఒక్కొక్కరుగా మునిగిపోవడం ప్రారంభించారు.
వారి అరుపులు, కేకలు దూరంగా ఉన్న స్థానికులు గమనించారు. గ్రామస్తులు వెంటనే రక్షణ, సహాయ చర్యలను ప్రారంభించారు. అతికష్టం మీద యువకులందరినీ రక్షించారు. వారిని ఖిజ్రాసరాయ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు యువకుల పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గయాలోని మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. మరో ముగ్గురు యువకులు ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డారని తెలిసింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి నుండి వైద్య నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..