కారును కొండపై పార్క్ చేసి రోమాన్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కారు కొండపై నుంచి కిందపడి ఒక యువతీ, యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన బ్రెజిల్‌లో వెలుగు చూసింది. కొన్ని నివేదికల్లో వెలువడిన కథనాల ప్రకారం.. గత నెల ఆగస్టు 3వ రాత్రి ఓ పార్టీకి హాజరైన ఒక యువతీ, యువకుడు.. పార్టీ పూర్తైన తర్వాత ఇంటికి వెళ్తూ.. రాత్రి ఒంటి గంట సమయంలో సమీపంలోని హ్యాంగ్ గ్లైడింగ్ లాంచ్ ర్యాంప్ దగ్గరకు వెళ్లారు. ఈ ప్రాంతం 1300 అడుగుల ఎత్తులో ఉంటుందని తెలుస్తోంది. అయితే అక్కడే కాసేపు గడుపుదామని కారును పక్కకు పార్క్ చేసి.. కార్లోనే రొమాన్స్‌లో మునిగిపోయారు. అయితే అదే సమయంలో అక్కడ వర్షం పడడంతో నేల మొత్తం తడిగా మారిపోయింది. వారు రొమాన్స్ చేస్తున్నట్టుప్పుడు కారు కదలడంతో అది కొండపై నుంచి జారీ కిందకు పడిపోయినట్టు తెలుస్తోంది. పై నుంచి పడిపోవడంతో ఆ జంట అక్కడికక్కడే మరణించించారు.
కారుపై నుంచి పడిపోవడంతో వచ్చిన భారీ శబ్ధానికి అక్కడున్న సెక్యూరిటీ ఏంటా అని పరిశీలించగా కారు పడిపోయినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీనా ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.