కేవలం రూ.2 లక్షల పెట్టుబడితో కళ్లచెదిరే లాభం! ఈ అద్భుతమైన స్కీమ్‌ గురించి తెలుసా?

కేవలం రూ.2 లక్షల పెట్టుబడితో కళ్లచెదిరే లాభం! ఈ అద్భుతమైన స్కీమ్‌ గురించి తెలుసా?


కేవలం రూ.2 లక్షల పెట్టుబడితో కళ్లచెదిరే లాభం! ఈ అద్భుతమైన స్కీమ్‌ గురించి తెలుసా?

మార్కెట్‌లో తరచూ జరిగే హెచ్చుతగ్గులు, అనిశ్చితి పరిస్థితుల్లో సాధారణ పెట్టుబడిదారులు తమ డబ్బుకు సురక్షితమైన, స్థిరమైన రాబడి ఇచ్చే పథకాలను కోరుకుంటారు. అలాంటి వారికి ప్రభుత్వ హామీతో వచ్చే పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ప్రస్తుతం పెట్టుబడిదారులలో ప్రాచుర్యం పొందుతోంది. ఈ పథకం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. అయితే ఇది భారత ప్రభుత్వ హామీతో ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఎక్కువ భద్రత ఉంటుంది. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల కాలపరిమితిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఇందులో ఉంది.

ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల డిపాజిట్‌లకు 7 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. అయితే ఐదు సంవత్సరాల పెట్టుబడికి 7.5 శాతం వడ్డీ లభించడం ఈ పథకం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల కాలానికి రూ.2 లక్షలు డిపాజిట్ చేశారని అనుకుందాం. 7.5 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఐదు సంవత్సరాల తరువాత మొత్తం సొమ్ము దాదాపు రూ.2,89,990కు పెరుగుతుంది. అంటే అసలు పెట్టుబడికి అదనంగా సుమారు రూ.89,990 వడ్డీ రూపంలో లభిస్తుంది.

ఇక ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగినవారికి లాభం కూడా అదే మేర పెరుగుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలు ఐదు సంవత్సరాలకు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.7,24,974 లభిస్తుంది. ఇందులో సుమారు రూ.2,24,974 వడ్డీ ఆదాయం ఉంటుంది. ఈ పథకం మరో ప్రత్యేకత ఏమిటంటే ఐదు సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 80C కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాను తెరవడం కూడా చాలా సులభం. కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులతో ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు. ప్రతి సంవత్సరం వడ్డీ మీ ఖాతాకు జమ చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *