కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!

కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!


కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!

ఒక్క పాము కనిపిస్తేనే భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా ఆరు భారీ కొండచిలువలు ఒకేచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైనే పోతాయి. అచ్చం అలాంటి ఘటనే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముసిడివాడలో ఎదురైంది. జనావాసాల మధ్య ఆరు భారీ కొండచిలువలు ఒకే పైపులో తిష్ట వేయడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పెద ముషిడివాడలోని ఒక ఇంటి వెనుక భాగంలో మురికి కాలువ, కొన్ని పాడుబడిన పాత పైపులు, చెట్ల పొదలు ఉన్నాయి. అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం ప్రొక్లెయినర్‌తో కాలువను శుభ్రం చేస్తుండగా, పైపులో నుండి ఒక భారీ కొండచిలువ బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే వారు స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు తొలుత రెండు భారీ కొండచిలువలను చాకచక్యంగా బంధించారు. అయితే పైపు లోపల పరిశీలించగా మరో నాలుగు పాములు ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. అవి పైపు లోపల చిక్కుకుపోవడంతో బయటకు తీయడం కష్టమైంది. దీంతో చేసేది లేక ప్రోక్లైనర్ సహాయంతో మట్టిని తవ్వి పైపును బయటకు తీశారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ప్రోక్లైనర్ తగిలి రెండు పాములు మృతి చెందగా, మిగిలిన నాలుగు పాములను స్నేక్ క్యాచర్ సురక్షితంగా రక్షించారు. సుమారు ఆరడుగుల పైగా పొడవున్న ఈ నాలుగు కొండచిలువలను సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పొదలు చదును చేస్తున్న సమయంలో సురక్షిత స్థావరం కోసం ఈ పాములన్నీ ఆ పాడుబడిన పైపులోకి చేరి ఉంటాయని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత

పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి

కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం

ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు

Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *