
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట నూరేళ్లు కలిసి బ్రతకాలనుకుంది.. కానీ పెద్దల నిరాకరణ వారి జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది. కులాంతర వివాహం చేసుకున్న వివాదంలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా మహానంది మండలంలో కలకలం రేపింది. ఈశ్వర్ నగర్‌కు చెందిన శివప్రసాద్, స్వప్న గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పోలీసుల సమక్షంలో పెద్దల సాక్షిగా వివాహం చేసుకున్నారు. అయితే, శివప్రసాద్ తల్లి లక్ష్మీదేవి ఈ వివాహాన్ని ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివప్రసాద్ ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన స్వప్న, తన భర్త చనిపోయాడనే ఆవేదనతో మహానంది శివారులోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. స్వప్న మృతిపై ఆమె తల్లి మరియమ్మ, ఇతర బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు, శివప్రసాద్ బంధువులే ఆమెను చంపి చెట్టుకు ఉరి వేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతికి శివప్రసాద్ తల్లి, ఇతర బంధువులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శివప్రసాద్ నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మహానంది పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలుగులోకి తెస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యాభర్తల పంచాయితీ.. పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్నారుగా
హోటల్ చెక్ ఇన్‌కి ఇక ఆధార్ అవసరం లేదు
దేశ తొలి ‘రింగ్ మెట్రో’ ప్రారంభం.. మొదలైన కొత్త శకం
ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు
రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు