అందమైన, అద్భుతమైన పర్యాటక ప్రాంతంలో లక్ష్యాద్వీప్ ఒకటి. అరేబియా సముద్ర దీవులలో ఒక్కటైన ఇది, చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ అరుదైన వన్యప్రాణులు, పగడపు దిబ్బలు, పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉటుంది. అంతేకాదండోయ్ ఇక్కడ అస్సలే కుక్కులు కానీ, పాములు కాని ఉండవంట. మరి మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం పదండి.
స్వర్గం ఎలా ఉంటుంది అంటే ? చాలా మంది లక్షద్వీప్నే చూపిస్తుంటారు. ఎందుకంటే? ఇసుక పొడి. నీలం రంగులో మెరిసే నీళ్లు, ప్రశాంతమైన వాతావరణంతో ఇది భారత దేశపు రత్నంగా వెలుగొందుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ36 ద్వీపాలతో కూడిన ఈ కేంద్ర పాలిత ప్రాంతం, బీచ్ ప్రియులకు స్వర్గధామం అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి వాతావరణం అలా ఉంటుంది.
పర్యావరణానికి అనుకూలమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. ఇక్కడ చాలా వరకు కుక్కలు, పాములు అస్సలే ఉండవంట. ఇక్కడ పక్షి అభయారణ్యం, చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఇక్కడికి వెళ్లిన వారు పక్షలు గూడు కట్టుకోవడం, సంతోనాత్పత్తి, వాటి రక్షణ వంటి ఎన్నింటినో చూడవచ్చునంట. అంతే కాకుండా ఈ ప్రదేశంలో కొన్ని వందాల పక్షుల జాతులు నిలయంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
లక్షద్వీప్ కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రంలోనే ఉంటుందంట. కానీ ఇక్కడ దాదాపు 64,000 నివాసితులు ఉంటున్నారంట.అలాగే ఈ ప్రదేశంలో ఎక్కువగా సముద్రపు జీవులు , పక్షులు ఎక్కువగా కనిపిస్తాయంట. ఇక్కడ కుక్కలు, పాములు అస్సలే ఉండవని చెబుతున్నారు నిపుణులు.
ఎందుకంటే? ప్రకృతి ప్రేమకులకు స్వర్గధామమైన ఈ ప్రదేశాన్ని కాపాడటం కోసం, పర్యావరణ పరీరక్షణలో భాగంగా ఈ ప్రదేశంలో కుక్కలు, పాములు నిషేధిస్తారంట. ముఖ్యంగా ఈ ప్రదేశాలకు వెళ్లే పర్యాటక ప్రియులు కూడా తమ వెంట పెట్ డాగ్స్ తీసుకెళ్లడం నిషేధం.