కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ

కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ


కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ

కాకినాడ జిల్లా కరప గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కాశీలో కొలువైన వారాహి మాత తరహాలోనే, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. జనసేన సీనియర్ నాయకులు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. కాశీలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించిన ప్రసిద్ధ కళాకారుడే ఈ విగ్రహాన్ని కూడా చెక్కడం విశేషం. మరీ ముఖ్యంగా, అయోధ్య బాలరాముడి రూపాన్ని పోలి ఉండేలా ఈ వారాహి మాత ప్రతిరూపాన్ని తీర్చిదిద్దడం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ వేడుకకు కరప మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేదమంత్రాల సాక్షిగా మహిళలు భారీ ఎత్తున పసుపు కొమ్ములతో, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల దొరబాబు .. “ఈ పవిత్ర కార్యం తలపెట్టడం తన పూర్వజన్మ సుకృతమని” భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి మహిళను తన తోబుట్టువుగా భావించి, స్వయంగా చీరలు, పసుపు-కుంకుమలను పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ ప్రతిష్టాపనతో కరప గ్రామం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం

150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం

బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా

అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..

వీధిలో నడుస్తున్నపెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *