కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..

కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..


కాంతార సినిమా సీన్‌ను మిమిక్రీ చేసిన వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. రణవీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్‌వీర్‌ సింగ్‌ అనుకరించారని, అందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

గత ఏడాది గోవా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో.. రణ్‌వీర్‌సింగ్‌  మాట్లాడుతూ ‘కాంతార’లో రిషబ్‌శెట్టి నటనను మెచ్చుకున్నారు. సినిమాలో ఉన్న ‘పంజుర్లి’ హావభావాలను వేదికపై ప్రదర్శించారు. అప్పుడే రిషబ్‌శెట్టి అలా చేయొద్దంటూ ఆయనను వారించారు. అయితే, రణ్‌వీర్‌ ఇలా చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రణ్‌వీర్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఇలాంటి సీన్లలో నటించడం చాలా కష్టమని , రిషబ్‌శెట్టి అద్భుతంగా నటించాడని అన్నారు రణవీర్‌సింగ్‌. దేశం లోని అన్ని సంప్రదాయాలపై తనకు గౌరవం ఉందని , తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపడితే క్షమించాలని అని రణవీర్‌ కోరారు.  కాగా ఇటీవల దురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణవీర్. ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. మార్చి 19వ తేదీ ధురంధర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *