కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం

కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం


ప్రకృతి సృష్టించే వింతలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం కిష్టారం గ్రామంలో అలాంటి ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురుస సుబ్బయ్య అనే రైతు ఇంట్లో ఒక మేక వింత ఆకారంతో ఉన్న పిల్లకి జన్మనిచ్చింది. సాధారణంగా మేక పిల్లలు పుట్టగానే తన కాళ్లమీద నిలబడటానికి గెంతడానికి ప్రయత్నిస్తూ ఎంతో క్యూట్‌గా కనిపిస్తాయి, కానీ ఈ మేకపిల్ల రూపం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ మేకపిల్లకు కళ్లు, ముక్కు లేవు. ముఖం భాగం అంతా చదునుగా ఉండి, కేవలం నోరు మరియు చెవులు మాత్రమే ఉన్నాయి. ముక్కు లేకపోవడంతో ఆ మేకపిల్ల నోటి ద్వారానే శ్వాస తీసుకుంటోంది. అవయవ లోపం ఉన్నప్పటికీ, ఆ మేకపిల్ల ఆరోగ్యంగానే ఉండటం విశేషం. అది సొంతంగా తల్లి వద్ద పాలు తాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇటువంటి లోపాలతో పుట్టే జీవులు ఎక్కువ కాలం జీవించడం కష్టమని భావిస్తారు, కానీ ఈ మేకపిల్ల చురుగ్గా ఉండటం గమనార్హం.ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో, వింత ఆకారంలో ఉన్న ఆ మేకపిల్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, స్థానికులు సుబ్బయ్య ఇంటికి క్యూ కడుతున్నారు. జన్యుపరమైన లోపాల వల్లే ఇలా జరుగుతుందని కొందరు భావిస్తుండగా, ఈ వింత జీవిని చూసి గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే

ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం

భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..

Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *