కరూర్‌ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

కరూర్‌ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్


టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌ సభలో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేతగా విజయ్ భారీ సభను ఏర్పాటు చేశాడు. ఈ సభకు పోలీస్ అనుమతి కూడా తీసుకున్నారు. 10వేళా మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు కానీ విజయ్ అభిమానులు అక్కడకు భారీగా వచ్చారు దాంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. ఒకరిమీద ఒకరు పడి తొక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారు. 50కి పైగా గాయపడ్డారు. ఆరుగురు చిన్నారులు, 16మంది మహిళలు చనిపోయారు. సహాయక చర్యలు, వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే ఈ ప్రమాదం పై సీఎం స్టాలిన్ స్పందించారు. అలాగే ప్రధాన పాంట్రీ మోడీ, అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన చాలా దుఃఖం కలిగిస్తుందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే సినీ నటుడు రజినీకాంత్ కూడా ఈప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్‌ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం బాధాకరం, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ద్రౌపది ముర్ము తెలిపారు.

ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కరూర్‌ ఘటన పై స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు పవన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ కోరారు.” తమిళనాడు రాష్ట్రం కరూర్ లో నటుడు, టి.వి.కె. పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను” అని పవన్ అన్నారు.

విజయ్ మీటింగ్ లో తొక్కిసలాట







Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *