చివరకు తమ కూతురిని బలవంతంగా కారులో ఎక్కించుకుని మెరుపువేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒకే గ్రామానికి చెందిన శ్వేత – ప్రవీణ్ పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ.. శ్వేత కుటుంబ సభ్యులు కన్నెర్రజేయడంతో.. రిజిష్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. ఇది నాలుగు నెలల కిందటి మాట. మూడుముళ్ల మ్యాటర్ తెలుసుకుని ఇంటికి ఆహ్వానించింది ప్రవీణ్ ఫ్యామిలీ. అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో పడిందీ కొత్త జంట. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు శ్వేతకు ఎక్కడ తమ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని అమ్మాయి తల్లిదండ్రులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి, చివరకు ఆస్తి వద్దని కూతురుతో రాయించుకున్నారు. ఆస్తి లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు కోపంతో రగిపోయారు. మరోవైపు శ్వేత అత్తారింటి దగ్గర ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగా.. ఒక్కసారిగా ఇంటిముందు కారు ఆగింది. ఏంటా అని చూసేలోపే.. శ్వేత తల్లిదండ్రులు బాల్ నరసింహా – మహేశ్వరిలు కొంతమందిని పోగేసుకుని మూకుమ్మడిగా దాడికి దిగారు. ఇంట్లో ఉన్న శ్వేతను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం
Venezuela Earthquake: భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
పట్టపగలు దారిదోపిడీ..ఏకంగా కోట్ల విలువైన బంగారం దోచేశారు
పద్ధతి మార్చుకోమన్న పై అధికారిని బెల్టుతో కొట్టిన హెడ్మాస్టర్.. కారణం ఇదే
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం