విశాఖపట్నంలో గత వారం రోజుల్లో అధిక సంఖ్యలో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్నేక్ సేవర్ సొసైటీకి చెందిన కిరణ్ అండ్ టీం వారం రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పాములను రక్షించారు. ఇందులో పది నాగుపాములు, ఐదు పిల్ల నాగులు, కొన్ని రాట్ స్నేక్స్ ఉన్నాయి. వర్షాల కారణంగా పాములు జనవాసాలలోకి ప్రవేశించాయి. ఋషికొండ టీటీడీ ఆలయం, ఆంధ్ర యూనివర్సిటీ వంటి ప్రాంతాల నుండి ఈ పాములను రక్షించారు. స్నేక్ సేవర్ సొసైటీ సభ్యులు పాములను సురక్షితంగా పట్టుకుని, అడవి ప్రాంతాలలో విడిచిపెట్టారు. దీంతో విశాఖ ప్రజలు ఉపశమనం పొందారు.
మరిన్ని వీడియోల కోసం :