కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!

కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!


కంటెంట్ ఉన్నపుడు భయమేలా.. 100 కాదు 200 కోట్లు పెడదాం..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘భారీ బడ్జెట్’, ‘మైండ్ బ్లోయింగ్ VFX’.. ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా రావట్లేదు. పెద్ద హీరోలే కాదు.. మీడియం రేంజ్ సినిమాలకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం పోస్తున్నాయి. అసలు బడ్జెట్‌లో కాంప్రమైజ్ కాకుండా.. గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేయడానికి ముస్తాబవుతున్న ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దామా..? చూస్తున్నారుగా.. ఈ గ్లింప్స్ చూస్తుంటే తెలుగు సినిమాలా కూడా కనిపించట్లేదు.. వృషకర్మ కోసం మేకర్స్ ఏకంగా 100 కోట్లు పెడుతున్నారు.. ప్రతీ రూపాయి ఫ్రేమ్‌లో కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. టీజర్ చూస్తుంటే ఇది గూస్‌బంప్స్ తెప్పించే సినిమా అని అర్థమవుతోంది. తన శిష్యుడు కార్తీక్ దండు చేసిన మ్యాజిక్ చూసి సుకుమార్ సైతం ఫిదా అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్‌తో అదరగొడుతున్న సంబరాల ఏటిగట్టు కోసం కూడా అక్షరాలా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి బడ్జెట్ విషయంలో అస్సలు వెనకాడకుండా ఈ సినిమాకి గ్రాండ్ బ్యాకింగ్ ఇస్తున్నారు. దర్శకుడు రోహిత్ ఒక సరికొత్త విజువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న నాగబంధం బడ్జెట్ 80 కోట్ల పైమాటే. స్టార్ వ్యాల్యూ లేకుండా కంటెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారీయన. దీనిపై అభిషేక్‌కు ఉన్న నమ్మకం చూస్తుంటే.. ఔట్ పుట్‌పై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమైపోతుంది. సినిమాలో ఉండబోయే ప్రతీ విజువల్ అద్భుతంగా రాబోతోందని.. కచ్చితంగా ఇది బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని టీమ్ ధీమాగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ విషయం లో అలా చేయడం.. లాభమా.. ? నష్టమా..?

Virosh Wedding: ఇన్‌స్టాలో విరోష్ వెడ్డింగ్ సాంగ్ కొత్త రికార్డ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *