ఓ వైపు విడాకుల రూమర్స్.. మరోవైపు ఆ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నజ్రియా

ఓ వైపు విడాకుల రూమర్స్.. మరోవైపు ఆ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నజ్రియా


ఓ వైపు విడాకుల రూమర్స్.. మరోవైపు ఆ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నజ్రియా

నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నజ్రియా నజీమ్ తన భర్త ఫహద్ ఫాజిల్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది.

వరుసగా తొమ్మిది ఫ్లాప్స్.. క్రేజ్ మాత్రం పీక్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్

నజ్రియా రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 2014లో అంజలి రచన దర్శకత్వం వహించిన బెంగుళూరు డేస్ చిత్రంలో నజ్రియా నటించింది. ఇందులో ఫహద్ ఫాజిల్ నజ్రియా భర్తగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాని తర్వాత నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిపోయారు. పెళ్లి తర్వాత ఈ జంట తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే.. ఫహద్ ఫాజిల్మొన్నామధ్య తెలుగులో పుష్ప 2తో భారీ హిట్ అందుకున్నాడు.

సౌందర్యతో పాటు నేను ఆ హెలికాఫ్టర్‌లో వెళ్ళాల్సింది.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్

ఇదిలా ఉంటే మొన్నామధ్య నజ్రియా భర్త ఫహద్ నుంచి విడిపోతుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నజ్రియా కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటుంది. మొన్నామధ్య సూక్ష్మ దర్శిని అనే సినిమా చేసింది. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నజ్రియా జీవితంలో ఏం జరుగుతుంది అంటూ ఆరాలు తీస్తున్నారు.ఇదిలా ఉంటే మొన్న ఓ కార్యక్రమానికి భర్త ఫహద్ ఫాజిల్ తో కలిసి పాల్గొంది. దాంతో రూమర్స్ కు చెక్ పడింది. ఇటీవలే ఓనం కూడా సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం నజ్రియా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాలో టోవినో థామస్‌తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

నరకం చూపించిన దర్శకుడు.. 7సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటున్న నటి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *