ఓర్నాయనో.. చికెన్ బోన్స్‌ను పొట్టు పొట్టుగా తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..

ఓర్నాయనో.. చికెన్ బోన్స్‌ను పొట్టు పొట్టుగా తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..


ఓర్నాయనో.. చికెన్ బోన్స్‌ను పొట్టు పొట్టుగా తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..

వీకెండ్ వచ్చిందంటే చాలు, మాంసాహార ప్రియులకు పండగే.. చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిని ఆనందంగా లాగించేస్తుంటారు. కొంతమంది ఇంట్లో వండుకొని రుచి చూస్తే, మరికొంతమంది హోటళ్లలో బిర్యానీలు, ఇతర వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్. అయితే కొందరైతే చికెన్ తినేటప్పుడు బోన్స్, అంటే ఎముకలను కూడా నమిలి మింగేస్తుంటారు. వాటిలో ఉండే మజ్జని జుర్రేస్తుంటారు. కానీ చికెన్ ఎముకలు తినడం మంచిదేనా? వాటిని తినడం వల్ల లాభమా, నష్టమా? ఈ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

సాధారణంగా, ఎముకల్లో మజ్జ అనే పదార్థం ఉంటుంది. మనుషులతో సహా ప్రతి జీవికి ఇది సహజం. దీనిలో అనేక పోషకాలు ఇమిడి ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, చేతులు లేదా కాళ్లు విరిగిన వారికి వైద్యులు తరచుగా మేక ఎముకల సూప్ తాగమని సలహా ఇస్తుంటారు. ఈ సూప్ విరిగిన ఎముకలు వేగంగా అతుక్కోవడానికి, వాటి రికవరీకి ఎంతగానో సహాయపడుతుందని నమ్ముతారు. మేక ఎముకల మజ్జలో ఉండే కొలాజెన్, మినరల్స్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.

అయితే, కోడి బోన్స్ విషయానికి వస్తే, ఇక్కడే రెండు రకాల ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటగా, నాటుకోడి ఎముకలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నాటుకోడి సహజసిద్ధంగా పెరుగుతుంది కాబట్టి, దాని ఎముక మధ్యలో కొలాజెన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA), గ్లైసిన్, గ్లూకోసమైన్ వంటి అనేక ఆరోగ్యకరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి దోహదపడతాయి. అలాగే, కీళ్ల పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. కీళ్ల వాపులు, నొప్పులు ఉన్నవారు నాటుకోడి ఎముకల మజ్జను తింటే ఉపశమనం లభిస్తుందని చెబుతారు. బోన్ మ్యారోలో విటమిన్ A, B, B1, B5, B7 తో పాటు జింక్, ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి అనేక ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియలను మెరుగుపరచడానికి, శక్తి మార్పిడికి ఎంతో దోహదపడతాయి. అయితే, ఎముకలు గట్టిగా ఉంటే అవి గొంతులో ఇరుక్కుపోయే లేదా పేగులను పొడిచే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు నిపుణులు..

కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా బ్రాయిలర్ కోళ్లనే తింటున్నారు. మాంసాహారం వినియోగించడంలో ఈ బ్రాయిలర్ కోళ్ల మాంసమే సగం వాటాను కలిగి ఉంటుంది. ఈ బ్రాయిలర్ కోళ్లను ఎలా పెంచుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిని త్వరగా పెరిగేందుకు, బరువు పెరిగేందుకు అనేక రకాల ఇంజక్షన్లు, హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ ప్రక్రియ సహజసిద్ధంగా ఉండదు. అందుకే బ్రాయిలర్ కోళ్ల చికెన్ ఎముకలు మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పలు సమస్యలు వచ్చే ప్రమాదముందంటున్నారు.

ఈ బ్రాయిలర్ కోడి ఎముకల మూలుగు తింటే డేంజర్ అని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఎందుకంటే ఈ బ్రాయిలర్ కోళ్లను వేగంగా పెంచడానికి ఇచ్చే ఇంజక్షన్ల ప్రభావం వాటి ఎముకలపై తీవ్రంగా పడుతుంది. ఈ ఎముకలను తినడం వల్ల మానవ శరీరానికి ప్రమాదం పొంచి ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ అలవాటు క్యాన్సర్ తో పాటు పలు రకాల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇలా కృత్రిమంగా పెంచిన బ్రాయిలర్ కోడి ఎముకలను అస్సలు నమలకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై కోడి మాంసం తినేటప్పుడు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకొని, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *