మన చుట్టూ ఉండే ప్రకృతిలో మనుషులు, జంతువులు, వివిధ రకాల పక్షులు, ఇలా రకరకాల జీవులు ఉంటాయి. ప్రతి దానికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ భూమిపై మనుగడ సాగించేందుకు ఈ ప్రకృతే ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకతను ఇస్తుంది. ఇకపోతే, పాములంటే దాదాపు ప్రతి ఒక్కరూ భయంతో పారిపోతారు. అదే నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే ఎంతో బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది. మొసళ్ల మడుగులోకి వెళ్లిన ఒక పాము వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని దాదాపు 130,000 మంది వీక్షించారు. ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. దాదాపు 2,000 మంది దీన్ని లైక్ చేశారు. ఈ వీడియోలో మొసలి పెద్ద పామును పట్టుకుంది. ఆ మొసలి దాదాపు పామును చంపేసినట్టుగానే ఉంది. కానీ, అదే పాము కోసం మరో మొసలి కూడా పోటీ పడుతోంది. కానీ, అంతలోనే దూరంగా కొందరు మనుషులు అరుపులు, కేకలు పెడుతున్నారు. దీంతో ఒక మొసలి పామును వదిలేసింది..ఈ దృశ్యం చూసేందుకు చాలా భయానకంగా ఉంది. పామును రెండు మొసళ్లు పట్టుకుని లాగేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
— Damn Nature You Scary (@AmazingSights) August 24, 2025
ఈ వీడియో ప్రకృతి క్రూరమైన నియమాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా అడవి జంతువులలో బలమైనది బలహీనమైన దానిని చంపుతుంది. వీడియోలో మొసళ్ల ఆవరణలో కొంతమంది వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనుషుల మాటలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ పామును వేరే చోట నుండి తీసుకువచ్చి ఇక్కడ వదిలివేసి ఉండవచ్చు అంటున్నారు కొందరు నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..