
సుమారు 12 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో, చిరుత గోళ్లు తగలటంతో ప్రవేశ్ బట్టలన్నీ రక్తసిక్తమయ్యాయి. అయితే, ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. మార్చి 6 నుంచే చిరుత సంచారంపై అటవీ శాఖకు ఫిర్యాదు చేసినా, బోను ఏర్పాటు చేయడంలో వారు విఫలమయ్యారని ప్రవేశ్ బాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.చిరుతతో పోరాడి గెలిచిన ప్రవేశ్ శర్మ సాహసంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అటవీ శాఖ డివిజనల్ అధికారి రాజ్‌కుమార్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించి, గాయపడిన ప్రవేశ్‌కు తక్షణ సహాయంగా రూ. 5,000 అందజేశారు. వన్యప్రాణుల సహజ ఆవాసాలు దెబ్బతినడం వల్లే అవి ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాధారణంగా చిరుతలు రాత్రి వేళల్లో వేటాడుతాయని, కానీ ఈ చిరుత తెల్లవారుజామునే దాడికి దిగిందంటే అది ఎంతటి ఆకలితో ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. చావు అంచుల్లో నిలబడి మృగాన్ని మట్టుబెట్టిన ప్రవేశ్ శౌర్యసాహసాల గురించి తెలుసుకున్న స్థానికులు, తోటి విద్యార్థులు అతడిని హీరోగా అభివర్ణిస్తున్నారు. అసాధారణ తెగింపుతో ప్రాణాలను
మరిన్ని వీడియోల కోసం :