ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన

ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన


చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత విశేషమైన ఘట్టంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో సుమారు 20 మంది వైద్య నిపుణులు, నర్సుల బృందం సమిష్టి కృషితో ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రసవంలో నలుగురు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించారు. వైద్యుల వివరాల ప్రకారం, సహజ సిద్ధంగా ఒకేసారి ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం సుమారు ఆరు కోట్ల ప్రసవాల్లో ఒకటే ఉంటుంది. తమ 40 ఏళ్ల వైద్య సేవా ప్రయాణంలో ఇలాంటి అరుదైన ప్రసవాన్ని చూడటం ఇదే తొలిసారి అని కొందరు సీనియర్ వైద్యులు అన్నారు. పుట్టిన ఐదుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది. గర్భధారణ సమయంలో అధిక రిస్క్‌ ఉండటంతో ముందస్తు ప్రణాళికతో వైద్య బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ చిన్నారులను ప్రేమగా ‘మిరాకిల్ బేబీస్’ అంటూ పిలుస్తున్నారు. సహజ సిద్ధంగా ఐదుగురు శిశువులు జన్మించడం ప్రపంచవ్యాప్తంగా అరుదైన విషయం అవ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *