ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..

ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..


ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ బ్యూటీలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ కుర్ర భామలు దూసుకుపోతున్నారు. ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. చిన్న సినిమాలతోనే సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవ్వగానే మినిమమ్ మూడు సినిమాలను లైనప్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాదు.. హీరోయిన్ గా మూడు సినిమాలు చేసింది. వాటిలో రెండు సూపర్ హిట్స్.. ఒకటి డిజాస్టర్. మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇక ఒక్క సినిమా డిజాస్టర్ అవ్వగానే సినిమాలకు గ్యాప్ తీసుకుంది.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

అయితే ఆమె నిజంగానే గ్యాప్ తీసుకుందా లేక అవకాశాలు రావడంలేదా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ హీరోయిన్ గా అదృష్టం కలిసి రావడం లేదు ఆమెకు.. తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.పదుల సంఖ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ సినిమాలుగా చేసి ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఆమె కావ్య కళ్యాణ్ రామ్. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తన నటనతో మెప్పించింది ఈ చిన్నది. ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆతర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన ఉస్తాద్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కావ్య సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *