Headlines

ఐడియా అదిరింది గురూ.. 50 ఏళ్లుగా నో సిలిండర్.. ఆ హోటల్‌కు గ్యాస్‌తో పనిలేదు

ఐడియా అదిరింది గురూ.. 50 ఏళ్లుగా నో సిలిండర్.. ఆ హోటల్‌కు గ్యాస్‌తో పనిలేదు


ఐడియా అదిరింది గురూ.. 50 ఏళ్లుగా నో సిలిండర్.. ఆ హోటల్‌కు గ్యాస్‌తో పనిలేదు

దేశమంతా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్‌ క్లోజ్ చేస్తుంటే.. ఇక్కడో హోటల్ మాత్రం గ్యాస్‌తో తమకు పనిలేదని చెప్తోంది. అవును కడప నగరంలోని పురాతన చరిత్ర కలిగిన హోటల్ గ్యాస్‌తో మాకేం సంబంధం లేదంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. దాదాపు 50 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ హోటల్లో ఇప్పటివరకు గ్యాస్ ను వాడలేదు. కట్టెలు, వేరుశనగ పొట్టు తోనే వంటలు చేస్తున్నారు. గ్యాస్‌తో అనేక ఇబ్బందులు ఉంటాయని.. అదే కట్టెల పొయ్యి అయితే ఎటువంటి ప్రమాదము ఉండకపోగా మంచి రుచికరమైన ఆహారాన్ని అందివ్వగలుగుతామని హోటల్‌లో పని చేసే మాస్టర్లు అంటున్నారు.

అంతేకాకుండా ఆ హోటల్ యజమాని మాట్లాడుతూ.. తాము 50 ఏళ్లుగా ఈ హోటల్ నడుపుతున్నామని.. ఇప్పటివరకు గ్యాస్ అనే మాటే మా దగ్గర లేదని నిత్యం కట్టెలు, వేరుశనగపొట్టుతోనే వంట చేస్తామని తెలిపారు. ఇన్నేళ్ల చరిత్రలో గ్యాస్ తో ఇంతవరకు వంటే చేయలేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఇటువంటి ఆపత్కాలంలో పురాతన పద్ధతి మరోసారి విజయం సాధించింది అనడానికి ఇదో పెద్ద నిదర్శనం ఈ విషయం తెలిసిన నెటిజన్లు, స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *