సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలకు వారు కీలక సూచన చేశారు. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఐటీ కంపెనీలకు వారు సూచించారు. వాతావరణ పరిస్థితుల అనుకూలించని నేపథ్యంలో తమకు సహకరించాలని ఐటీ కంపెనీలను ఈ సందర్భంగా వారు కోరారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మరో వైపు సెప్టెంబర్ 26వ తేదీ వర్క్ చేస్తే.. శని, ఆదివారాలు ఎలాగో ఐటీ కంపెనీలకు సెలవు. అలాగే గురువారం దసరా పండగ వచ్చింది. దీంతో శుక్రవారం వర్క్ చేసి.. ఆ రోజు రాత్రి పండగ నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు వెళ్లాలని ఇప్పటికే సాప్ట్‌వేర్ ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంటే.. సోమ, మంగళ, బుధవారాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా తమకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే హెచ్‌వోడీలకు ఐటీ నిపుణులు విజ్జప్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే శుక్రవారం అంటే.. అక్టోబర్ 3వ తేదీ సైతం వర్క్ ఫ్రెమ్ హోమ్ చేస్తే.. అక్టోబర్ 5వ తేదీన తిరిగి హైదరాబాద్ మహానగరానికి తీరిగి రావచ్చనే ఆలోచనలో ఐటీ నిపుణులు ముందస్తుగా ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పండగ ముందు ఊరు వెళ్లితే.. దాదాపు 10 రోజుల తర్వాత మహనగరానికి రావచ్చని వారు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పురానాపూల్‌లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల క్యూ
కమ్ బ్యాక్ కోసం చూస్తున్న డైరెక్టర్స్
Pawan Kalyan’s OG Movie: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్
Naveen Polishetty: ప్రమోషన్స్‌తో కుమ్మేస్తున్న నవీన్ పొలిశెట్టి