‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!

‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!


AI ఎఫెక్ట్‌ ఇప్పటికే ఉద్యోగాలపై పడింది. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉద్యోగులు అవసరమైన పనులను నేడు ‘ఏఐ’ క్షణాల్లో పూర్తి చేస్తోంది. అయితే దీని వల్ల తీవ్ర మానసిక వేదన మిగులుతోందని కెనడాకు చెందిన ‘ఫౌండర్ రియాలిటీ’ వ్యవస్థాపకుడు జార్జ్ పు వాపోయారు. తన సంస్థలో 14 మంది బృందాన్ని ఐదుగురికి తగ్గించాల్సి రావడం తన వృత్తి జీవితంలోనే అత్యంత కఠిన నిర్ణయమని జార్జ్ పూ బాధపడ్డారు. ఒక ఏడాదిలో టీమ్ సభ్యులను భారీగా తగ్గించి, కొత్త నియామకాలు చేపట్టకుండా ఏఐపైనే ఆధారపడటంతో ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు సాధించామని అయితే అది మానవత్వాన్ని మరచిన ఒంటరి ప్రయాణంగా మారిందని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపార ఆదాయంపై ఒత్తిడి పడుతున్న తరుణంలో సంస్థ మనుగడ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు జార్జ్ తెలిపారు. మనుషులు అవసరమని భావించిన ప్రతి పనినీ కృత్రిమ మేధతోనే పూర్తి చేస్తున్నామని, టెక్నాలజీ మన అంచనాలకు మించి ఫలితాలనిస్తోందని అన్నారు. ఈ మార్పు వల్ల కంపెనీ మార్జిన్లు పెరిగినప్పటికీ తోటి ఉద్యోగులను పంపించేయడంతో ఎదురైన మానసిక క్షోభ ఎవరూ తీర్చలేనిదని ‘ఎక్స్’వేదికగా తెలిపారు. ‘ఇది తన కెరీర్‌లో అత్యుత్తమ ఆర్థిక నిర్ణయం.. కానీ అత్యంత దారుణ భావోద్వేగ అనుభవం’ అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒంటరితనం గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. పోస్ట్‌పై నెటిజన్లు రియాక్ట్‌ అయ్యారు. కృత్రిమ మేధ పనితీరును భర్తీ చేయగలదు కానీ, ఒక సంస్థ నిర్మాణం వెనుకుండే మనుషుల ఉద్వేగాలను, వారి శక్తిని భర్తీ చేయలేదని కొందరు కామెంట్‌ చేసారు. పొదుపు పేరుతో ఉద్యోగులను తొలగించడం వల్ల యజమానిపై పనిభారం పెరగడమే కాకుండా, సహోద్యోగులతో ఉండే సంబంధాలు తెగిపోతాయని నెటిజన్లు కామెంట్లు చేసారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త

పాక్‌ ఉగ్రవాదులను పట్టించిన ‘టైసన్’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *