కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టవు.. అలాంటి సినిమాలు మనదగ్గర చాలా ఉన్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి భారీ హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా సంచలన విజయం సాధించాయి. అలాగే థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు ఓటీటీలోనూ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఓ సినిమా దాదాపు 7ఏళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతోంది. అంతేకాదు ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఆ సినిమా. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకూ ఆ సినిమా ఏదో తెలుసా..? ఓటీటీలో మెప్పిస్తున్న ఈ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా ఏదంటే..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?
టాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ఆ సినిమా మరేదో కాదు.. కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసిన ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తన గ్లామర్ తో కట్టిపడేసింది. తన అందంతో తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
ముఖ్యంగా రొమాంటిక్ సినిమాల్లో సీన్స్ లో పాయల్ రాజ్ పుత్ రెచ్చిపోయి నటించింది. దాంతో ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. కాగా ఈ సినిమా థియేటర్స్ లోనే కాదు.. ఓటీటీలోనూ అదరగొడుతుంది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆర్ఎక్స్ 100 సినిమా.. ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగుతుంది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఈ సినిమా.. ఈ సినిమా తర్వాత పాయల్ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తుంది. మరోవైపు కార్తికేయ కూడా హీరోగా అలాగే విలన్ గానూ సినిమాలు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..